Home> ఏపీ
Advertisement

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే

AP SSC Results 2024: పదవ తరగతి విద్యార్దులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలపై అప్‌డేట్ వెలువడింది. ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయో క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫలితాలను "bse.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు ముఖ్య గమనిక. పదో తరగతి పరీక్షల ఫలితాలపై స్పష్టత వచ్చింది. ఆంద్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసేంందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈసారి గత ఏడాది కంటే ముందుగానే ఫలితాలు విడుదల కానున్నాయి. 

ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ప్రస్తుతం వాల్యుయేషన్ రీ వెరిఫికేషన్, ఆన్‌లైన్ మార్కుల నమోదు, కంప్యూటరీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దాంతో ఎన్నికల సంఘం అనుమతి రాగానే ఏప్రిల్ 25-30 మధ్య తేదీల్లో ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాక చెక్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా సాంకేతికపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఫలితాలతో పాటు మార్కుల మెమో కూడా ప్రదర్శించనున్నారు. 

ఏపీలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 6 లక్షల 30 వేల 633 మంది హాజరయ్యారు. 3 వేల 473 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు అత్యంత పగడ్బందీగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి లీకేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ప్రశ్నకు స్కాన్ కోడ్ ఉంచడం ద్వారా ఒకవేళ లీకైనా ఎక్కడ లీకైంది తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను  bse.ap.gov.in. ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 

Also read: AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More