Home> ఏపీ
Advertisement

AP CM YS Jaganకు లేఖ రాసిన కృష్ణపట్నం Anandaiah, సహకారం కోసం విజ్ఞప్తి

Anandaiah letter To AP CM YS Jagan Mohan Reddy: ఔషధానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా, మందు తయారీ పంపిణీ విషయంలో ఎలాంటి సహకారం అందడం లేదని కృష్ణప‌ట్నానికి చెందిన ఆనందయ్య సోమవారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో తమకు సహకారం అందించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు.

AP CM YS Jaganకు లేఖ రాసిన కృష్ణపట్నం Anandaiah, సహకారం కోసం విజ్ఞప్తి

Anandaiah letter To AP CM YS Jagan: ఆనంద‌య్య కరోనా మందుతో నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధానికి దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో ఔషధానికి ఏపీ ప్రభుత్వం అనుమతి లభించడంతో మందు పంపిణీని ఆనందయ్య, ఆయన కుటుంబసభ్యులు ప్రారంభించారు. 

ఔషధానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా, మందు తయారీ పంపిణీ విషయంలో ఎలాంటి సహకారం అందడం లేదని కృష్ణప‌ట్నానికి చెందిన ఆనందయ్య సోమవారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో తమకు సహకారం అందించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు. కరోనా బాధితుల కోసం ఔషధం తయారీకి, వేగంగా పంపిణీ చేయడానికి, తదిదర విషయాలలో సహకారం (Krishnapatnam Medicine Distribution) అందించాలని లేఖలో ఆనందయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే ఏపీ ప్రజలకు సాధ్యమైనంత త్వరగా కరోనా మందు పంపిణీ పూర్తి చేస్తామన్నారు.

Also Read: Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా

ఔషధం తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్ర ఏర్పాటు చేయాలని, ముడి సరుకు కొనుగోలుకు సైతం ప్రభుత్వం సహకారం లభిస్తే ఇతర రాష్ట్రాలకు కూడా తన ఔషధాన్ని పంపిణీ చేస్తామన్నారు. కేవలం అనుమతి లభించడంతో మందు పంపిణీ అంత సులభతరం కాదని, ఏపీ ప్రభుత్వం సైతం సహకారం అందిస్తే, త్వరగా ఔషధం (Krishnapatnam Corona Medicine) తయారీ, పంపిణీ సాధ్యమని ఆనందయ్య తన లేఖలో సీఎం వైఎస్ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. కృష్ణప‌ట్నం ప‌రిధిలో 144 సెక్షన్ అమ‌లు చేస్తున్నారు.

Also Read: Krishnapatnam ఆనందయ్య Corona Medicine పంపిణీ ప్రారంభం, కృష్ణపట్నంలో గందరగోళం 

కాగా, ఆనందయ్య తయారుచేస్తున్న మందులో కే రకం (K Type Medicine) ఔషధం అయిన కంటి చుక్కల మందు (Eye Drops)కు హైకోర్టు అనుమతిచ్చింది. ఆనందయ్య తయారుచేస్తున్న ఐ డ్రాప్స్‌కు క్రిమి రహిత పరీక్షలు (Sterility Test) నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్‌కు సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More