Home> ఏపీ
Advertisement

Omicron Variant: ఏపీలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు

Omicron Variant: దేశంలో ఒమిక్రాన్  వేరియంట్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఎక్కడికక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల అవసరం ఏర్పడటంతో..ఏపీ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభమైంది.
 

Omicron Variant: ఏపీలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు

Omicron Variant: దేశంలో ఒమిక్రాన్  వేరియంట్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఎక్కడికక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల అవసరం ఏర్పడటంతో..ఏపీ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభమైంది.

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 33 వేల కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళన రేపుతోంది. దేశంలో ఇప్పటి వరకూ 17 వందల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడ్డాయి.

ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron ) నిర్ధారణ ఇప్పటివరకూ చేస్తున్న ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో(RTPCR Test) సాధ్యం కాదు. దీనికోసం అదే శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్‌కు పంపాల్సి ఉంటుంది. ఇది ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఫలితంగా హైదరాబాద్ నుంచి ఫలితాలు వచ్చేంతవరకూ ఆలస్యమై..ఒమిక్రాన్ సంక్రమణ ఎక్కువవుతోంది. సమయాభావం తగ్గించేందుకు ఎక్కడి కక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్ ఏర్పాటు అవసరమైంది. ఒమిక్రాన్ ముప్పున్న దేశాల్నించి వచ్చేవారైనా లేదా ట్రావెల్ హిస్టరీ ఉంటే ఆ శాంపిల్స్ సీక్వెన్స్ పంపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ హైదరాబాద్‌లోని సీసీఎంబీపై ఆధారపడాల్సివస్తోంది. ఇప్పుడిక విజయవాడలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటైంది. సిద్ధార్ధ వైద్య కళాశాలలో ఇది ఏర్పాటైంది. విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ (Genome Sequencing Lab) ఏర్పాటవడంతో ఇక శాంపిల్స్ ఫలితాలు త్వరగా వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 17 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12వ స్థానంలో నిలిచింది. 

Also read: CM Jagan Meet PM Modi: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. రాష్ట్ర సమస్యలపై చర్చ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More