Home> ఏపీ
Advertisement

Anantapuram: మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కారు ఢికొని గాయపడిన యువకుడిని కాపాడేందుకు అటుగా వెళ్తున్న కూలీలు సపర్యలు చేస్తుండగా.. వారందరిపైకి లారీ దూసుకెళ్లింది.

Anantapuram: మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

AP Road Accident - 5 persons killed: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కారు ఢికొని గాయపడిన యువకుడిని కాపాడేందుకు అటుగా వెళ్తున్న కూలీలు సపర్యలు చేస్తుండగా.. వారందరిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన యువకుడితోపాటు మరో నలుగురు కూలీలు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ విషాద సంఘటన ఏపీ ( Andhra Pradesh ) లోని అనంతపురం (Anantapuram) జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. బత్తలపల్లి రాఘవంపల్లికి చెందిన రాజశేఖర్‌(20) అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా.. రాఘవంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలోనే కూలీపనులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్న కూలీలు వాహనాలను ఆపి క్షతగాత్రుడికి సపర్యలు చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్‌ లారీ కూలీలపై ( Road Accident ) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో (Bathalapalli) రాజశేఖర్‌తో పాటు నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Also read: Telangana: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి

మరణించిన వారిని తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు(40), ముష్టూరుకు చెందిన శివమ్మ(50), సంజీవపురానికి చెందిన సూరి(45), వలిసాబ్(50) గా గుర్తించారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also read: Covid-19: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఐసీఎంఆర్ చీఫ్‌కు కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More